ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదాల మధ్య తీవ్ర గందరగోళం ఏర్పడింది. జంగారెడ్డిగూడెం మరణాలపై టిడిపి సభ్యులు సభలో స్పీకర్ పై కాగితాలు చింపి వేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఐదుగురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని ఆదేశాలు ఇచ్చారు. బడ్జెట్ సెషన్ మొత్తం టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు ఉంటుందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్న నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, రామానాయుడు, స్వామి సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.
అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్సన్
March 14, 2022
0
Tags