దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి శాఖలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ కు కేటాయించారు. ఇప్పుడు ఉన్న ఫైనాన్స్, శాసనసభ వ్యవహారాలు, కమర్షియల్ టాక్స్ శాఖలకు అదనంగా ఐటీ, పరిశ్రమలు, కామర్స్ శాఖలు బుగ్గనకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. ఫిబ్రవరి 21 వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండె పోటు రావడంతో.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. మరణించారు. దీంతో వైసీపీ పార్టీ లో విషాదం చోటు చేసుకుంది. అయితే.. నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలోమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్య క్రియలు నిర్వహించారు.
మేకపాటి శాఖలు మంత్రి బుగ్గనకు కేటాయింపు
March 14, 2022
0
Tags