అమృత్‌సర్‌లో ఆప్ విజయోత్సవ ర్యాలీ

Telugu Lo Computer
0


పంజాబ్‌ లోని అమృత్‌సర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి రోడ్డు షో నిర్వహించారు. రోడ్డు షోలో  వేలాది మంది ఆప్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 16న ఆప్ ప్రభుత్వం పంజాబ్‌లో కొలువుదీరనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పంజాబ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ను కలిశారు భగవంత్‌ మాన్‌. మొన్న మొహాలీలో జరిగిన ఆప్‌ ఎమ్మెల్యేల సమావేశంలో తనను ఆప్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్టు గవర్నర్‌కు వివరించారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను బన్వరీలాల్‌ పురోహిత్‌కు అందించామన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే భగవంత్‌మాన్‌ సింగ్‌ కొన్నినిర్ణయాలు తీసుకున్నారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ సహా 122 మంది మాజీ ఎమ్మెల్యేల భద్రతను తొలగించారు. అంతేకాదు.. తాను రాజ్ భవన్ లో కాకుండా.భగత్ సింగ్ గ్రామమైన ఖట్కర్ కలన్ లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించి అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు. కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు ఉండవని, షహీద్ భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటోలు ఉంటాయని వెల్లడించారు. పంజాబ్‌లో కొత్త శకానికి ఆప్‌ నాంది పలుకుతుందన్నారు భగవంత్‌ సింగ్ మాన్. పాలనలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందిస్తామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)