ఢిల్లీ అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం!

Telugu Lo Computer
0


ఢిల్లీలోని గోకుల్ పురి ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గుడిసెలు ఉన్న ప్రాంతంలో అర్థరాత్రి మంటలు అంటుకున్నాయి. ఘటనలో 30 గుడిసెలు పూర్తిగా తగలబడిపోయాయి. ఏడుగురు సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. అర్థరాత్రి అంటుకున్న మంటలపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తెల్లవారేసరికి మంటలు అదుపులోకి తెచ్చారు. ఘటన ఎలా జరిగిందన్నదానిపై ఢిల్లీ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గోకుల్ పురి ఘటనలో గాయపడిన వారిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. మంటల్లో తీవ్ర గాయాలపాలైన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)