నేటితో ముగియనున్నతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telugu Lo Computer
0


నేటితో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఆఖరిరోజు కావడంతో కాగ్ నివేదికను ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే తొలిరోజు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. నాలుగు రోజుల పాటు బడ్జెట్ పై చర్చించారు. ఈసారి మొత్తం 37 పద్దులు ఆమోదం పొందాయి. ఈరోజు ప్రశ్నోత్తరాలను ఉభయ సభల్లో రద్దు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అసెంబ్లీకి వచ్చే అవకాశముంది. కేసీఆర్ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వైద్యులు కూడా వారంరోజుల పాటు విశ్రాంతి అవసరమని కేసీఆర్ కు సూచించారు. అయితే ఈరోజు సభకు వచ్చి కేసీఆర్ బడ్జెట్ పై మాట్లాడే అవకాశముందని తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)