మార్చి 1న తమిళనాడు సీఎం స్టాలిన్ పుట్టిన రోజు.ఈ శుభ సందర్భంగా తిరువళ్లూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు బంగారు ఉంగరం బహుమతిగా ఇస్తామని డీఎంకే తిరువళ్లూరు జిల్లా కన్వీనర్ భూపతి ప్రకటించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సింపుల్ గా ఉంటారు. సీఎం హోదాలో ఉన్నా ఏమాత్రం దర్పం ప్రదర్శించని వ్యక్తి. సీఎంగా ఉన్నా హంగూ ఆర్భాటాలు ప్రదర్శించరు. సరికదా..సామాన్య ప్రజల్ని కూడా ఆప్యాయంగా పలుకరిస్తారు. కష్టసుఖాలు తెలుసుకుంటారు. కానీ స్టాలిన్ పార్టీ నేతలు మాత్రం ఆయన పుట్టిన రోజుని ఘనంగా చేద్దామనుకున్నారు. పేదలకు సహాయం చేద్దామనే ఆలోచనతో మార్చి 1 సీఎం స్టాలిన్ బర్త్ డే శుభ సందర్భంగా ఘనంగా నిర్వహించాలని డీఎంకే నేతలు నిర్ణయించుకున్నారు. దీంట్లో భాగంగా ఆ పార్టీకి చెందిన తిరువళ్లూరు జిల్లా కన్వీనర్ స్టాలిన్ జన్మించిన మార్చిన 1న ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే పిల్లలకు ఏకంగా బంగారు ఉంగరాలను బహూకరిస్తానంటూ ప్రకటన చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే పిల్లలకు బంగారు ఉంగరం గిఫ్ట్
March 01, 2022
0
Tags