అసోం రాష్ట్రంలో యువతిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని వెల్లడించింది. గరియాన్ లో ఓ హోటల్ లో మైనర్ పై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పాన్ బజార్ మహిళా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనలో బికీతో పాటు నలుగురు స్నేహితులు ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది. అత్యాచారం అనంతరం పారిపోయిన వీరి కోసం పోలీసులు గాలించారు. ప్రధాన నిందితుడైన బికీ గురించి సమాచారం అందడంతో అతడిని మంగళవారం అదుపులోకి తీసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. కస్టడీలో ఉన్న బికి అలీ పారిపోయేందుకు ప్రయత్నించాడని, తాము ఆపేందుకు యత్నించగా దాడికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. దాడిలో ఇద్దరు మహిళా పోలీసులకు గాయాలయ్యాయయని తెలిపారు. లొంగిపోవాలని హెచ్చరించినా అతను వినిపించుకోలేదని, ఆత్మరక్షణార్థం అతడిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అసోంలో అత్యాచార నిందితుడి ఎన్ కౌంటర్ ?
March 16, 2022
0