భారత్, శ్రీలంకల మధ్య బెంగుళూరు లో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజే ఫలితం తేలింది. ఈ మ్యాచ్ లో భారత్ 238 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించి 2-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. శ్రీలంక ముందు 447 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్.. మూడో రోజు 208 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో టీమిండియా శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో వైట్ వాష్ చేసింది. అలాగే స్వదేశంలో వరుసగా 15వ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. అలాగే కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరంగేట్రంలోనే తొలి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. ఇప్పటికే తొలి వన్డే, టీ20 సిరీస్‌లను సాధించిన రోహిత్, టెస్ట్ సిరీస్‌ను గెలిచిన సారథిగా నిలిచాడు. ఇక శ్రీలంక టీంలో కెప్టెన్ దిముత్ కరుణరత్నే 107, కుసాల్ మెండిస్ 54 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అశ్విన్ 4, బుమ్రా 3, అక్షర్ పటేల్ 2, జడేజా 1 వికెట్ పడగొట్టారు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (67) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే సమయంలో రిషబ్ పంత్ 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక తరపున ప్రవీణ్ జయవిక్రమ 4 వికెట్లు, లసిత్ ఎంబుల్దేనియా 3 వికెట్లు తీశారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైంది. ఏంజెలో మాథ్యూస్ (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ చెరో 2 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఖాతాలో ఓ వికెట్ చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 252 పరుగులకు ఆలౌటైంది.
Post a Comment
0Comments
3/related/default