ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఆగ్రహం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఆ రాష్ర్ట హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఇటీవలే  ప్రభుత్వం 54 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ 54 మందిలో చాలామందికి నేర చరిత్ర ఉందంటూ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించగా.. మరోపక్క ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితులపై ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో 'ఏదైనా విషయంపై కోర్టులో విచారణ జరుగుతుండగా.. దానిపైనే ఆర్డినెన్స్ ఎలా జారీ చేస్తారు` అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే దానిపై ఇకపై ఎలాంటి ముందడుగు వేయబోమని ప్రభుత్వం న్యాయవాది పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)