గత మూడు రోజుల నుండి వరుసగా లాభాలలో దూసుకుపోయాయి స్టాక్ మార్కెట్స్. నేడు ఆ లాభాలకి బ్రేక్ పడి భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ని దెబ్బతీశాయి. దీంతో వారు ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమయినప్పటి నుంచి అమ్మకాలకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 770 పాయింట్లు నష్టపోయి 58,788కి పడిపోయింది. నిఫ్టీ 219 పాయింట్లు కోల్పోయి 17,560కి దిగజారింది. ఐటీసీ (1.14%), మారుతి సుజుకి (0.86%), టైటాన్ (0.46%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.05%), ఏసియన్ పెయింట్స్ (0.03%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. హెచ్ డీ ఎఫ్ సీ లిమిటెడ్ (-3.23%), ఇన్ఫోసిస్ (-2.76%), ఎల్ అండ్ టీ (-2.36%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.20%), బజాజ్ ఫైనాన్స్ (-1.88%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.
స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్ !
February 03, 2022
0