రష్మిక మందన నూతన గృహ ప్రవేశం ?

Telugu Lo Computer
0


హీరోయిన్ రష్మిక మందన టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. టాలీవుడ్ లో పలు ఆఫర్లని వదులుకుని బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించేందుకు యత్నిస్తోంది. అందుకోసమే ఎక్కువగా ముంబైలో ఉండాలని చూస్తుంది. అక్కడ ఉండటానికి అద్దె ఇంటికంటే ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు అనుకుందట. అప్పట్లో ఈమె ఓ కాస్ట్లీ ప్లాట్ ను కూడా ముంబయిలో కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి. ఆ ఇంటి గృహప్రవేశం త్వరలో జరగబోతోందట. ఈ విషయాన్ని రష్మిక పోస్ట్ చేసింది. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. సామాన్లు ప్యాక్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నానని ఆమె తెలిపింది. దీంతో ఆమె కొత్త ఇల్లు కొనుక్కుందా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. నిజానికి రష్మిక 2021 ఫిబ్రవరిలోనే ముంబైలో ఒక ఇంటిని కొనుగోలు చేసింది. బాలీవుడ్ లో నటిస్తున్న నేపథ్యంలో ఆమె ముంబైలో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)