గుజరాత్ లోని గాంధీనగర్ నియోజకవర్గం రాజ్కోట్ అవధ్ రోడ్డులో ఓ యువతి తీవ్ర గాయాలతో అచేతనంగా పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయాలు ఎలా అయ్యాయని అడిగితే యువతి చెప్పిన మాటలకు పోలీసులు షాక్ అయ్యారు. యువతికి గాయాలు కావడానికి కారణం వివాహేతర సంబంధంగా పోలీసులు తేల్చారు. యువతి ఓ వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరూ కలిసి తిరగడం, ఫోన్లు చేసుకోవడం అతని భార్యకు తెలిసింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని బాధితురాలైన యువతిని ఆమె ప్రియుడి భార్య మరో ఇద్దరు యువకుల సాయంతో కిడ్నాప్ చేయించింది. చేతులు తాళ్లతో కట్టేసి యువతిని చితకబాదారు. అంతటితో వదిలేయకుండా తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కసితో బాధిత యువతి యోనిలో కారం పొడిని నింపి చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి రోడ్డు పక్కన పడేసినట్లుగా బాధితురాలు పోలీసుల విచారణలో తెలిపింది. బాధితురాలి ప్రియుడి భార్య చేతిలో దెబ్బలు తిన్న యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లుగా పోలీసులు వెల్లడించారు. యువతి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలి ప్రియుడి భార్యని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కిడ్నాప్, హత్యాయత్నం కేసునమోదు చేశారు. యువతిని కిడ్నాప్, దాడి చేసేందుకు సహాకరించిన మరో ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేశారు. వారిపై కూడా కేసు నమోదు చేేశారు రాజ్కోట్ పోలీసులు. ముగ్గుర్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
గుజరాత్ లో అమానవీయ సంఘటన !
February 27, 2022
0
Tags