ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినా సరే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్నది. బాక్సాఫీస్ వసూళ్లు మాత్రం తగ్గడం లేదని సినీ వర్గాల టాక్. కాగా దీనిపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్.. 'దయచేసి ఈ దాడికి స్వస్తి చెప్పి సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయండి' అని కోరాడు. 'సృజన, సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి? చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ.. మరోపక్క మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీసు దగ్గర ఎందుకు? ఎంతగా ఇబ్బందిపెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరు' అని ట్వీట్ చేశాడు.
పవన్ స్టామినాను ఎవరూ ఆపలేరు : ప్రకాశ్ రాజ్
February 27, 2022
0
Tags