తల్లిని చంపిన కుమారుడు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్, విశాఖ మన్యంలోని జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ అడ్డుల గ్రామానికి చెందిన రేగం రామన్నదొర, అర్జులమ్మ(60) దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు మత్స్యలింగం(35) ఆదివారం అర్ధరాత్రి అధికంగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తల్లి అర్జులమ్మను నిద్రలేపి భోజనం పెట్టమన్నాడు. అన్నంతో చారు మాత్రమే ఉండటంతో కూర కావాలని అడిగాడు. కూర ఇంట్లో లేదని తల్లి చెప్పడంతో ఆమెపై ఆగ్రహించి చేయి చేసుకున్నాడు. తండ్రి కలుగజేసుకొని కుమారుడిని వారించాడు. ఆయనతోనూ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తల్లి, తండ్రి, కుమారుడి మధ్య తోపులాట జరిగింది. పెద్ద కుమారుడిని తీసుకొస్తానని చెప్పి తండ్రి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో తల్లి తలపై మత్స్యలింగం గొడ్డలితో మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త రామన్నదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)