పీఆర్సీ అంశంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు పీఆర్సీ సాధనసమితి స్టీరింగ్ కమిటీకి ఉపాధ్యాయ సంఘాలు రాజీనామా చేయనున్నారు. భవిష్యత్ కార్యాచరణను ఉపాధ్యాయులు ప్రకటించనున్నారు. ఉపాధ్యాయుల బాటలోనే తాము సైతం అని కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటున్నారు. మెరుగైన పీఆర్సీ కోసం ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాడుతామని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో ఉపాధ్యాయులు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సంబంధించి ఆన్‌లైన్ సమావేశంలో ఉపాధ్యాయుల సలహాలు, సూచనలను ఉపాధ్యాయ సంఘ నేతలు తెలుసుకున్నారు. చివరకు ఉద్యమం తప్పదని ఉపాధ్యయలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
కొనసాగుతున్న ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆందోళనలు
February 08, 2022
0