బీజేపీలో చేరిన రెజ్లర్ దలీప్ సింగ్ రాణా

Telugu Lo Computer
0


ప్రొఫెషనల్ రెజ్లర్ దలిప్ సింగ్ రాణా అలియాస్ ద గ్రేట్ ఖలీ ఈరోజు బీజేపీలో చేరారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం ప్రత్యేకత సంతరించుకున్నది. పంజాబ్‌లో ఫిబ్రవరి 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని, దేశం కోసం మోదీ చేస్తున్న పనులు ఆయన్ను ఉత్తమ ప్రధానిగా మారుస్తోందని, జాతి అభివృద్ధి భాగస్వామ్యం కావడానికి ఆ పార్టీలో చేరినట్లు ఖలీ తెలిపాడు. బీజేపీ జాతీయ విధానం తనను ఆకర్షించినట్లు రెజ్లర్ ఖలీ చెప్పాడు. 2020లో కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన రైతు సంఘాలకు ఖలీ మద్దతు ఇచ్చారు. రైతులకు అండగా ప్రజలు నిలువాలని కూడా ఆయన కోరారు.


Post a Comment

0Comments

Post a Comment (0)