తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన గొబ్బూరి శ్రీవర్ష (19) హైదరాబాద్‌లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. తండ్రి ఓ ప్రైవేట్ సంస్థలో చిరుద్యోగి. ఆమె కాలేజీ ఫీజులు చెల్లించేందుకు ఆయన చాలా ఇబ్బందులు పడేవారు. తన వల్లే కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుందని భావించింది. హైదరాబాద్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచిబయలుదేరిన ఆమె.. రైలులో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో.. నడుస్తున్న రైల్లో నుంచి దూకేసింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నడుస్తున్న రైల్లో నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
February 04, 2022
0
Tags