సాహస యాత్రలో అపశృతి

Telugu Lo Computer
0

 

కేరళ లోని పాలక్కడ్‌ సమీప మలప్పుజ ప్రాంతంలోని కొండ ప్రాంతంలో సోమవారం మిత్రులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువకుడు ఈ ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుంచి నీరూ, ఆహారం లేకుండా బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. గమనించిన సహాయక బృందం యువకుడిని బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎంతగా ప్రయత్నించినా యువకుడి దాకా చేరలేకపోతోంది. కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు. కొండల మధ్య చిక్కుకున్న యువకుడిని రక్షించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైన్యం సహాయం కోరారు. దీంతో బెంగళూరు నుంచి ఓ ప్రత్యేక దళాన్ని పంపుతున్నట్లు సదరన్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అరుణ్‌ సీఎంవోకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు తమిళనాడులోని వెల్లింగ్టన్‌ నుంచి మరో బృందం పాలక్కడ్‌కు బయలుదేరింది. సహాయక చర్యల్లో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి పారా కమాండోలు సైతం రానున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. కొండ నడుమలో గూడు లాంటి చోట కూర్చొని సాయం కోసం ఎదురుచూస్తున్న బాబును కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ దళం కూడా ప్రయత్నిస్తోంది. గత సోమవారం మరో ఇద్దరు మిత్రులతో కలిసి కొండ శిఖరం ఎక్కేందుకు యువకుడు ప్రయత్నించాడు. మిగతా ఇద్దరూ మధ్యలోనే విరమించుకున్నా అతడు మాత్రం విజయవంతంగా కొండ శిఖరం చేరుకున్నాడు. ఇదే సమయంలో ఉన్నట్టుండి కిందికి జారిపడి మధ్యలో ఇరుక్కున్నాడు. ఈ విషయాన్ని సెల్ ఫోన్ సహాయంతో తన మిత్రులకు తెలిపాడు. ఈ క్రమంలో సహాయక బృందాలు బుధవారం సాయంత్రం వరకు యువకుడిని కాపాడే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నం వరకూ యువకుడు సురక్షితంగానే ఉన్నాడని, అతడి ఆరోగ్యం సాధారణంగా ఉందని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)