19 మంది నక్సల్స్ లొంగుబాటు
February 28, 2022
0
ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో 19 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో నలుగురు మహిళా నక్సల్స్ కూడా ఉన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లాలోని భెజ్జీ పోలీసు సేష్టన్‌లో పోలీసు, సిఆర్‌పిఎఫ్ అధికారుల ఎదుట నక్సల్స్ తమకు తాముగా లొంగిపోయారు. మావోయిస్టుల అమానుష, డొల్ల సిద్ధాంతాలపై నిస్పృహ చెంది తాము లొంగిపోతున్నట్లు వారంతా తెలిపారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. లొంగిపోయిన నక్సల్స్ అందరూ భెజ్జీలోని బోధ్‌రాజ్‌పడర్ గ్రామానికి చెందినవారని, వీరంతా మావోయిస్టు ఉద్యమంలో కింది స్థాయి క్యాడర్ అని ఆయన వివరించారు. వీరి వెంట పెద్ద సంఖ్యలో గ్రామస్థులు కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చారని ఆయన చెప్పారు.