దేశంలో కొత్తగా 8,013 కొత్త కేసులు నమోదు కాగా, 119 కరోనా మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కరోనా మరణాల్లో కేరళ నుంచి 62 మంది, కర్ణాటక నుంచి 17 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,02,601 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. 0.24 శాతంగా యాక్టివ్ కేసుల సంఖ్య నమోదైంది. కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 1.11 శాతానికి చేరుకుంది. ఇప్పటివరకూ 4,29,24,130 కరోనా కేసులు నమోదు కాగా, 5,13,843 మరణాలు నమోదయ్యాయి. రికవరీ రేటు కూడా 98.56 శాతంగా నమోదైంది. కరోనా నుంచి 16,765 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,23,07,686 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
దేశంలో 10వేలకు దిగువన కరోనా కొత్త కేసులు
February 28, 2022
0