శ్రీదేవి నాకు అక్క కాదు!

Telugu Lo Computer
0


90లలో హీరోయిన్ మహేశ్వరి చేసింది తక్కువ సినిమాలైనా ఫుల్ క్రేజ్ తెచ్చుకొని అభిమానులని సంపాదించుకుంది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ‘గులాబీ’ సినిమాతో స్టార్ అయింది మహేశ్వరి. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని ‘మేఘాలలో..’, ’ఈవేళలో నీవు’.. లాంటి సాంగ్స్ ఇప్పటికి క్లాసిక్ గా నిలిచాయి. ఆ తర్వాత మహేశ్వరి హీరోయిన్ గా నటించిన సినిమాల్లో పెళ్లి, ప్రియరాగాలు, తిరుమల తిరుపతి వెంకటేశ సినిమాలు మంచి విజయం సాధించాయి. 2000 సంవత్సరం తర్వాత మహేశ్వరి సినిమాలు చేయడం మానేశారు. తాజాగా చాలా కాలం తర్వాత ‘ఆలీతో సరదాగా’ టాక్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తాజాగా మహేశ్వరి ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ షోకి గెస్టుగా వచ్చిన మహేశ్వరి ఆసక్తికర విషయాలు తెలియచేశారు. చాలా మంది శ్రీదేవి మహేశ్వరికి అక్క అనుకుంటారు. అలాగే చెప్తారు కూడా. కానీ మహేశ్వరి ఈ షోలో అసలు విషయం చెప్పింది. ఈ విషయంపై మహేశ్వరి మాట్లాడుతూ.. ”శ్రీదేవి తనకు అక్క అవుతుందని అందరూ భావిస్తారు. కానీ శ్రీదేవి నాకు పిన్ని అవుతుంది. నేను మాత్రం అక్కా అని పిలిచేదాన్ని. పప్పక్క అని శ్రీదేవిని పిలవడం అలవాటు. నేను అలా అక్కా అని పిలవడంతో అందరూ శ్రీదేవి నాకు అక్క అవుతుందేమో అనుకున్నారు” అని తెలిపింది. అంతే కాక శ్రీదేవి మరణం పై స్పందిస్తూ.. ”తను ఇంకా ఏ అబ్రాడ్ లో షూటింగో, ఈవెంటో చేస్తున్నారన్న ఫీలింగ్ ఉంది. ఆవిడ లేరంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు”.

Post a Comment

0Comments

Post a Comment (0)