భక్తితో జెండా వందనం...!

Telugu Lo Computer
0

 

రిపబ్లిక్ డే వేడుకలు దేశవ్యాప్తంగా నేడు ఘనంగా నిర్వహించారు. పిల్లల నుంచి పెద్దల దాకా, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు ఇలా అందరూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే వీరందరిలో ఒక వృద్దురాలు చేసిన జెండావందనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడో తెలియదు కానీ, జెండా ఎగరక ముందే అటుగా వెళ్తున్న మహిళ చేసిన జెండావందనం అందరినీ ఆకర్షిస్తోంది. జెండాను చూసిన వెంటనే చెప్పులు విడిచి, చేతిలో ఉన్న సంచిని పక్కన పెట్టి జెండా గద్దె వద్దకు చేరుకుంది. కళ్లకు అద్దుకొని సెల్యూట్ చేసింది. అనంతరం చెప్పులు వేసుకొని, సంచి తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియోను 'ద బెటర్ ఇండియా' ట్వీట్ చేయగా.. దానిని సినీనటి రవీనా టాండన్ రీట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియోవైరల్ అయ్యింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)