ఇలాంటి పరిస్థితి నేనెప్పుడూ చూడలేదు:ఉండవల్లి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగుల తాజా పరిస్థితి తాను ఇప్పటి వరకూ ఎప్పుడు ఎక్కడ చూడలేదని ఉండవల్లి అరుణ కుమార్ అన్నారు. ఉద్యోగస్తులకు కొత్త పి.ఆర్.సి అమలు చేయటం వల్ల 10,247 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని ప్రభుత్వం అంటుంది. ఉద్యోగస్తులు అసలు మాకు జీతాలు పెంచొద్దు, మాకు పెంచిన కొత్త జీతాలు వద్దు పాత జీతాలే చాలు అంటున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతున్నారు. అసలు ఇలాంటి పరిస్థితి తానెప్పుడూ చూడలేదన్నారు ఉండవల్లి. ఎక్కడైనా ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ జీతాలు పెంచాలంటూ సమ్మెలు చేయటం చూశాను. అంతేకానీ మాకు పెంచిన జీతాలు వద్దు. పాత జీతాలే ముద్దు అంటూ సమ్మె నోటీసు ఇవ్వడం బహుశా ఇదే ప్రధమం అనుకుంటానని అన్నారు ఉండవల్లి. ఒకపక్క కరోనా బీభత్సం సృష్టిస్తోంది. మరొక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. ఇవన్ని ప్రభుత్వ ఉద్యోగులు దృష్టిలో పెట్టుకుని సమ్మెను ఆపవలసిందిగా ప్రార్ధిస్తున్నానని చెప్పారు. జగన్ ప్రభుత్వము, ఉద్యోగ సంఘాలు.. పట్టింపులకు పోకుండా, చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం సాధించవల్సిందిగా కోరుతున్నాను అని ఉండవల్లి అరుణ కుమార్ అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)