కమర్షియల్ సిలెండర్‌పై 91 రూపాయలు తగ్గింపు!

Telugu Lo Computer
0


దేశంలోని ఎల్బీజీ గ్యాస్ వినియోగదారులకు ఇది శుభవార్త. ప్రతి నెలా 1వ తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధరల్లో సమీక్ష చేస్తుంటాయి. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ధరల్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంటాయి. ఇందులో దేశంలో రెండు రకాల గ్యాస్ సిలెండర్లు అందుబాటులో ఉన్నాయి. డొమెస్టిక్ అవసరాల్ని తీర్చే 14.5 లీటర్ల ఎల్పీజీ సిలెండర్, వాణిజ్యపరంగా ఉపయోగించే 19 కిలోల కమర్షియల్ సిలెండర్. ప్రతి నెలా జరిపే సమీక్షలో భాగంగా దేశంలోని ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 19 కిలోల వాణిజ్య సిలెండర్ ధరను భారీగా తగ్గింది. కమర్షియల్ సిలెండర్ ధరను 91 రూపాయలు 50 పైసలు తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ సిలెండర్ ధరల్లో మాత్రం ఏ విధమైన మార్పు లేదు. గత నెలలో ఉన్న ధరలే కొనసాగనున్నాయి. కమర్షియల్ సిలెండర్‌పై 91 రూపాయలు తగ్గించడంతో ఢిల్లీలో కమర్షియల్ సిలెండర్ ధర ఇవాళ్టి నుంచి 1907 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. నిన్నటి వరకూ ఢిల్లీలో కమర్షియల్ సిలెండర్ ధర 1999 రూపాయలుండేది. దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కమర్షియల్ సిలెండర్ ధరలు తగ్గించారనే వార్తలు ట్రోల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)