భారత్‌తో టీ20 సిరీస్‌కు విండీస్‌ జట్టు!

Telugu Lo Computer
0


భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు జట్టును  ప్రకటించింది. ఇంగ్లండ్‌తో తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌లో బరిలోకి దిగిన జట్టును దాదాపుగా కొనసాగిస్తూ 16 మందితో టీమ్‌ను ప్రకటించింది. సిరీస్‌కు దూరమయ్యాడు. జనవరి మొదట్లోనూ హెట్‌మైర్‌ సరైన ఫిట్‌నెస్‌ లేని కారణంగా జట్టుకు ఎంపిక కాలేకపోయినట్లు విండీస్‌ చీఫ్‌ కోచ్‌ ఫిల్‌ సిమ్మన్స్‌ పేర్కొన్నాడు. బంతిని బలంగా బాదే హెట్‌మైర్‌ తరుచూ ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్నాడని తెలిపాడు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రాణించినట్లే.. భారత్‌పై మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని విండీస్‌ చీఫ్‌ సెలెక్టర్‌ డెస్మండ్‌ హేన్స్‌ అన్నాడు. పొలార్డ్‌ (కెప్టెన్‌), పూరన్‌ (వైస్‌ కెప్టెన్‌), అలెన్‌, బ్రావో, రోస్టన్‌ చేజ్‌, కాట్రెల్‌, డ్రేక్స్‌, హోల్డర్‌, షాయి హోప్‌, హుసేన్‌, కింగ్‌, పావెల్‌, షెఫర్డ్‌, స్మిత్‌, కైల్‌ మేయర్స్‌, హేడన్‌ వాల్ష్‌.


Post a Comment

0Comments

Post a Comment (0)