సముద్రం 200 అడుగులు వెనక్కు!

Telugu Lo Computer
0


సముద్రం ప్రశాంతంగా కనిపిస్తూ ఒక్కసారిగా 200 అడుగులు వెనక్కు వెళ్లడాన్ని చూసిన మత్స్యకారులు టెన్షన పడ్డారు. ముక్కాం తీరంలో సోమవారం ఈ దృశ్యాన్ని స్థానిక మత్స్యకారులు గమనించారు. అమావాస్య, పౌర్ణమి, తుఫాన్ల సమయాల్లో సంద్రం ముందుకు రావడం, వెనక్కు జరగడం సాధారణమే. మామూలు రోజుల్లో ఎప్పుడూ లేనివిధంగా జరగడంతో అందరూ ఆందోళన చెందారు. వెనక్కు జరుగుతున్న సమయంలో పెద్దపెద్ద బండరాళ్లు కనిపించాయి. కొన్ని పడవలు రాళ్ల మధ్య ఉండిపోవడం, పడవలకు రాళ్లు తగలడంతో అవి స్వల్పంగా దెబ్బతిన్నాయి. గత్యంతరం లేక కొందరు మత్స్యకారులు ట్రాక్టర్‌ సహాయంతో పడవలను బయటకు తీసుకొచ్చారు. సుమారు పది నెలలనుంచి సంద్రంలో అనేక మార్పులు గమనిస్తున్నామని మత్స్యకారులు చెబుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)