అఖండకే హైలైట్‌ ఈ జోడు గిత్తలు

Telugu Lo Computer
0

 

అఖండ సినిమాలో ఎద్దుల ఫైటింగ్‌ సీన్‌ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. గిత్తెలతో హీరో అరంగేట్రం కూడా చాలా బాగుంది. ఈ ఎద్దులను చూడడానికి చౌటుప్పల్‌ బాట పట్టారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారానికి చెందిన రైతు శ్రీనివాస్‌ యాదవ్‌కు చెందినవి ఈ గిత్తెలు. ఆంధ్ర నుండి రెండు ఎద్దులను తీసుకొచ్చి వాటికి కృష్ణ, అర్జున అని పేర్లు పెట్టి ట్రైనింగ్‌ ఇచ్చాడు. ఈ గిత్తెల వీడియో చూసి ఆఖండ సినిమా టీమ్‌ నుంచి పిలుపువచ్చిందని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఆ విధంగా ఆఖండ సినిమాలో తన గిత్తెలను వాడుకున్నట్లు చెప్పారు. సినిమాతో ఫేమస్ అయిన తన గిత్తలను చూడడానికి పెద్ద ఎత్తున జనం వస్తున్నారని యాదవ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)