సౌతాఫ్రికా టూర్‌కు గ్రీన్‌సిగ్నల్‌

Telugu Lo Computer
0


దక్షిణాఫ్రికా పర్యటన ఖరారు అయ్యింది. టీమిండియా టూర్‌కు చెందిన వివరాలను ఇవాళ బీసీసీఐ కార్యదర్శి జే షా వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో సౌతాఫ్రికా టూర్‌పై సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుందని జే షా వెల్లడించారు. కానీ ఆ జట్టుతో జరగాల్సిన నాలుగు టీ20 మ్యాచ్‌లను మాత్రం వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలను మాత్రం యధావిధి షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు. డిసెంబర్ 17వ తేదీ నుంచి సౌతాఫ్రికా టూర్ ప్రారంభంకానున్నది. కరోనాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ తొలుత దక్షిణాఫ్రికాలో బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా టూర్‌పై సందేహాలు వ్యక్తం అయ్యాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)