సోషల్ మీడియా ద్వారా బ్లాక్ మెయిల్ !

Telugu Lo Computer
0


వరంగల్‌ జిల్లా పరకాలకు చెందిన పాలకుర్తి అజయ్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ మల్టీమీడి యా కోర్సు చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో అమ్మాయిలు, అబ్బాయిల ప్రొఫైల్స్‌తో ఖాతాలు తెరిచాడు. వాటితో యువతులు, మైనర్లకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి, స్నేహం ముసుగులో సెక్స్‌ చాట్‌ చేసేవాడు. అలా రఫీపాషా పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచిన అజయ్‌ ఒక బాలికతో ఫ్రెండ్‌షిప్‌ చేసి ఆమెను ముగ్గులోకి దింపాడు. సెక్స్‌ చాట్‌ చేసి బాధితురాలి నగ్న ఫొటోలు, వీడియోలు సేకరించాడు. వాటితో బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బులు డిమాండ్‌ చేశాడు. ఆ బాధితురాలికి యువతిలా పరిచయమై చాటింగ్‌ చేశాడు. వాడిచేతిలో తాను కూడా బ్లాక్‌మెయిలింగ్‌కు గురయ్యాయని, వాడికి రూ.9 వేలు ఇస్తే సరిపోతుందని నమ్మించాడు. నువ్వు మూడు వేలు ఇవ్వుకావాలంటే నేను మిగతావి ఇచ్చేస్తా అని చెప్పటంతో బాధితురాలు రూ.3 వేలు తీసుకెళ్లి బ్లాక్‌మెయిలర్‌ చెప్పినట్టు దిల్‌సుఖ్‌నగర్‌లో బస్టాప్‌ వద్ద పెట్టింది. రెండు రోజులకు మరో ఆరువేలు ఇవ్వాలని అజయ్‌ డిమాండ్‌ చేశాడు. బాధితురాలికి ఏం చేయాలో తెలీక ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ను ఆశ్రయించింది. అక్కడి అధికారుల సూచనతో సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేయగా 7 ఇన్‌స్టాగ్రామ్‌, 7 ఫేస్‌బుక్‌ ఖాతాలు ఉన్నట్టు తేలింది. అజయ్‌ బాధితులు దాదాపు 200 మంది ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)