ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే షేక్ మహ్మద్ జియావుద్దీన్ ని మైనార్టీ వెల్ఫేర్ సలహాదారు డిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మైనార్టీ వెల్ఫేర్ శాఖ స్పెషల్ సెక్రటరీ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. షేక్ మహ్మద్ జియావుద్దీన్ రెండేళ్ల పాటు సలహాదారు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జగన్ కేబినెట్‌లో ఉన్న మంత్రుల కంటే ప్రభుత్వ సలహాదారుల సంఖ్యే అత్యధికంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు సైతం సలహాదారుల నియామకంపై మండిపడుతున్నాయి.