ట్రైన్ లో సీటు కోసం వ్యక్తిపై దాడి....!

Telugu Lo Computer
0


మంజునాథ్ అనే వ్యక్తి ఉపాధి కోసం హంపీ ఎక్స్ ప్రెస్ లో బెంగళూరు వెళ్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున రైలు ఆంధ్రప్రదేశ్  లోని అనంతపురం జిల్లా హిందూపురం చేరుకుంది. ఆ సమయంలో ఓ నలుగురు వ్యక్తులు ట్రైన్లో సీటు కోసం మంజనాథ్ తో గొడవపడ్డారు. అతన్ని  సీటు నుంచే లేవాలని ఆ నలుగురు బలవంతం చేయడంతో టీటీఈకి ఫిర్యాదు చేసేందుకు బయలుదేరాడు. వెంటనే మంజునాథ్ ను అడ్డుకున్న నలుగురు వ్యక్తులు అతడి వద్ద నుంచి బంగారు ఉంగరం లాక్కొని ట్రైన్ లో నుంచి కిందకు తోసేశారు. హిందూపురం రూరల్ మండలం ములుగూరు సమీపంలోని రైల్వే ట్రాక్ దిగువ భాగంలో ఓ యువకుడు తీవ్రగాయాలతో పడి ఉండటాన్ని ఆదివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో రైల్వే కీమ్యాన్ గమనించాడు. 12 గంటల పాటు అతడు గాయలతో అలాగే పడి ఉన్నాడు. మంజునాథ్ స్పృహలో లేకపోవడంతో 108కి ఫోన్ చేసి హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న మంజునాథ్ జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువకుడిపై దాడికి పాల్పడిన వారు హిందూపురంలో ట్రైన్ ఎక్కారా? లేక వేరే చోట ఎక్కి ఇక్కడ గొడవపడ్డారా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ట్రైన్లో సీటు కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)