దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం రాష్ట్రాలకు పలుసూచనలను చేసింది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కఠిన నిబంధలను పాటించాలని ఆదేశించింది. పండుగ వేళ ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేలా రాత్రి వేళల్లో కర్ఫ్యూని అమలు చేయాలని, భారీ సభలు, సమూహాలను నియంత్రించాలని సూచించింది. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల్లో ప్రజలు ఒకచోట గుమిగూడ కుండా చర్యలు తీసుకొవాలని ఆదేశించింది. కరోనా క్లస్టర్‌లను గుర్తించి కంటైన్‌మెంట్ చేయాలని సూచించింది. ఈ ఆంక్షలను కనీసం 14 రోజులు పాటించేలా చూడాలని కోరింది. అదే విధంగా ప్రజలంతా, వ్యాక్సినేషన్ తీసుకునేలా చర్యలు తీసుకొవాలని ఆదేశించింది. ప్రజలంతా, మాస్క్, సానిటైజేషన్, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. కాగా, రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలని కేంద్రం సూచించింది.
రాత్రి వేళల్లో కర్ఫ్యూని అమలు చేయండి!
December 23, 2021
0
Tags