కేటిఆర్‌కు మద్దతుగా నిలిచిన వైఎస్ షర్మిల

Telugu Lo Computer
0


వైసీపీ అధినేత్రి షర్మిల కేటిఆర్‌కు మద్దతు పలికారు. ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ఒక తల్లిగా, రాజకీయ పార్టీ నేతగా పిల్లలను రాజకీయాల్లోకి గుంజడాన్ని ఖండిస్తున్నా, కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలను సహించేది లేదని, రాజకీయాల్లో మహిళలను , పిల్లలను కించపరిచినా రాజకీయాలకు అతీతంగా కలిసి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ యూటూబ్ చానల్లో.. రాష్ట్ర అభివృద్దిపై ఒపినియన్ పోల్ నిర్వహించాడు. ఆ పోల్‌లో భాగంగా రాష్ట్రంలో అభివృద్దిపై ప్రశ్నించాడు. రాష్ట్రంలో అభివృద్ది ఎక్కడ జరిగింది అంటూ...1 భద్రాచలం గుడిలోనా 2 కేటిఆర్ కొడుకు హిమాన్షు శరీరంలోనా అంటూ పోల్ నిర్వహించాడు. ఈ పోల్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డాను ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)