మద్యం మత్తులో హత్య

Telugu Lo Computer
0


కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకా రిప్పన్‌పేట సమీపంలోని గరతికెరె  గ్రామానికి చెందిన సతీశ్‌ (32) భార్య పుట్టింటికి వెళ్లడంతో తన ఇద్దరు స్నేహితులను ఇంటికి పిలిపించుకుని పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో గొడవలు జరిగాయి. స్నేహితులు సతీశ్‌ను చాకుతో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గ్రామంలోని చెరువులో పడేశారు. గురువారం సాయంత్రం పొద్దుపోయిన తరువాత మృతదేహం బయటకు తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)