ప్రత్యేక అకౌంట్లను తెరవండి : కేంద్రం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14, 15వ ఆర్ధిక సంఘం నిధులను విద్యుత్‌ బిల్లుల బకాయిల పేరిట రూ. 1300 కోట్లను తీసుకుంది. మరోవైపు..15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 944 కోట్లను వారం రోజుల క్రితమే పంచాయతీ అకౌంట్ల నుంచి ఆర్ధిక శాఖ మళ్లించుకున్నది. దీంతో ఈ వరుసగా నిధుల మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వానికి  ఫిర్యాదులు అందాయి. ఆర్థిక సంఘం నిధులు పంపేందుకు ప్రత్యేక అకౌంట్లను పంచాయతీ పేరిట ప్రారంభించాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనితో పంచాయతీ రాజ్‌ కమీషనర్‌.. జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు ఇక నుంచి ఈ అకౌంట్‌లో వేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అకౌంట్లు గ్రామ పంచాయతీ పేరు మీద, యూనియన్‌ బ్యాంక్‌లో ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇకపై అన్ని పంచాయతీలు వెంటనే అకౌంట్లు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)