మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం

Telugu Lo Computer
0


మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం మత్స్య సంపద యోజనను ప్రారంభించింది. ఈ స్కీమ్ 2024-25 వరకు వర్తిస్తుంది. మత్స్యకారులు, మత్స్య కార్మికులు, చేపల వ్యాపారులు, మత్స్య రంగానికి సంబంధించిన ఇతర వ్యక్తులు కూడా ఈ స్కీమ్ నుండి లబ్ధి పొందవచ్చు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని 5 సంవత్సరాలు అమలు చేస్తారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 వరకు వర్తిస్తుంది. సంవత్సరానికి 9 శాతం చొప్పున మత్స్య రంగం పెంపుతో 2024-25 నాటికి 22 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం నెరవేరుతుంది. మత్స్యకారులు, మత్స్య కార్మికులు, చేపల విక్రయదారులు, మత్స్య అభివృద్ధి కార్పొరేషన్లు, స్వయం సహాయక సంఘాలు, మత్స్య రంగం, మత్స్య సహకార సంఘాలు, మత్స్యకార సంఘాలు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేట్ సంస్థలు, మత్స్య ఉత్పత్తిదారులు ఈ పధకాన్నివినియోగించుకోచ్చు. 3 లక్షల లోన్ సౌకర్యం ఉన్నది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ pmmsy.dof.gov.inకి వెళ్లాలి. దీని ద్వారా మీరు అప్లై చేసుకోచ్చు. ఆధార్ కార్డు, చేపల పెంపకం కార్డు, నివాస ధృవీకరణ పత్రం, సంప్రదింపు నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు అప్ లోడ్ చేయాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)