No title

Telugu Lo Computer
0


ఛత్తీస్​గఢ్​లోని రాజ్​నంద్​గావ్ జిల్లా​లో దారుణం జరిగింది. పదకొండో తరగతి చదువుతున్న బాలికపై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈనెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. డిసెంబరు 2న నిందితుడు ఎడ్యుకేషనల్​ ట్రిప్​కు తీసుకెళ్తానంటూ బాధితురాలిని బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నాడు. ఒక నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలిస్తే అత్యాచారం చేస్తానని బాధితురాలి అక్కను కూడా బెదిరించాడు. ఈ ఘటన గురించి బాధితురాలి తల్లిదండ్రులకు సోమవారం తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్​ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)