గడ్డంతో హెల్త్ బెనిఫిట్స్!

Telugu Lo Computer
0


గడ్డముంటే కొంతమంది పరమ చిరాకుగా ఫీలవుతారు. మరికొంతమంది ఫ్యాషన్ సింబల్‌గా భావిస్తారు. గడ్డంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఇంగ్లాండ్‌లోని సండర్‌ల్యాండ్ యూనివర్సిటీకి చెందిన సర్జికల్ డాక్టర్, లెక్చరర్  డాక్టర్ కరణ్ రంగార్జన్ గడ్డంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టిక్‌టాక్‌లో యాక్టివ్‌గా ఉండే  డాక్టర్ కరణ్ మెడికల్ అంశాలపై తన వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఆయన 'గడ్డంతో హెల్త్ బెనిఫిట్స్' అనే టాపిక్‌గా మాట్లాడారు. ముఖం నున్నగా, క్లీన్ షేవ్‌తో ఉండటం కన్నా.. కాస్త గడ్డం పెంచుకోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. 'ఒక పరిశోధన ప్రకారం... ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిలో గడ్డంతో ఉన్నవారి కంటే గడ్డం లేనివారి ముఖంపై మార్సా అనే బాక్టీరియా ఉండేందుకు మూడు రెట్లు ఎక్కువ అవకాశం ఉంది.' అని పేర్కొన్నారు. మార్సా అనే బాక్టీరియా చాలా రకాల యాంటీ బయాటిక్స్‌ను  సైతం తట్టుకునే నిరోధకతను కలిగి ఉంటుందని కరణ్ తెలిపారు. ఒకరకంగా పలు ఇన్ఫెక్షన్లకు ఇచ్చే ట్రీట్‌మెంట్ కంటే దీన్ని ట్రీట్ చేయడం కష్టమన్నారు. క్లీన్ షేవ్  చేసుకునే సమయంలో చర్మం రాపిడికి గురై సూక్ష్మమైన పగుళ్లు ఏర్పడుతాయని... అక్కడే మార్సా బాక్టీరియా వృద్ది చెందుతుందని అన్నారు. కాబట్టి క్లీన్ షేవ్ కంటే కాస్త గడ్డం పెంచితే ఈ బాక్టీరియా పెరిగే అవకాశం తక్కువ ఉంటుందన్నారు. అంతేకాక గడ్డం వల్ల ముఖంపై చర్మం సూర్యుని అతినీల లోహిత కిరణాల బారినపడకుండా ఉంటుందని అన్నారు. తద్వారా చర్మ క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. టిక్‌టాక్‌లో డా.కరణ్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ దాదాపు 3లక్షల వ్యూస్‌తో పాటు వందల కొద్ది కామెంట్స్ వచ్చాయి. గడ్డం  గురించి కరణ్ చెప్పింది విన్న తర్వాత.. చాలామంది దీని వెనకాల ఇంత కథ ఉందా అని ఆశ్ఛర్యపడుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)