ఆలీకి కేఎల్ వర్సిటీ డాక్టరేట్

Telugu Lo Computer
0


ప్రముఖ కమెడియన్ ఆలీకి కెఎల్ వర్సిటీ డాక్టరేట్ ని ప్రకటించింది. కేఎల్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించడం సంతోషకరం అన్నారు ఆలీ. సొంత ఊరిలో ఉండగా ఈ డాక్టరేట్ రావడం సంతోషాన్ని కలిగించిందన్నారు. సీఎం జగన్ మంత్రి పదవిని ఇస్తే మరింత సంతోషమని ఆలీ తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, హామీ కూడా ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పరిపాలనా అద్భుతంగా ఉందని.. ఆయన అన్ని వర్గాలకు సమన్యాయం చేకూర్చారని కొనియాడారు. ఏపీ ప్రజలకు అన్నీ రకాలుగా జగన్ సర్కార్ ఉపయోగ పడుతుందన్నారు. ఆన్‌లైన్ టికెట్, బెన్‌ఫిట్ షో వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)