పుష్ప సక్సెస్ మీట్ క్యాన్సిల్

Telugu Lo Computer
0


పుష్పలో స్మగ్లర్ కమ్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో  మాస్ లుక్‏లో బన్నీ అదరగొట్టాడు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటించగా సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలలో నటించారు. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా తాజాగా వందకోట్ల క్లబ్‏లో చేరిపోయింది. ఈ సందర్భంగా వరుసగా పలు ప్రాంతాల్లో పుష్ప సక్సెస్ పార్టీ నిర్వహిస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు నిర్మాతలు.  ఈ క్రమంలోనే ఈరోజు కాకినాడలో పుష్ప సక్సెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు చిత్రయూనిట్ నిన్న ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను కూడా దాదాపు పూర్తిచేసింది. అయితే పుష్ప సక్సెస్ మీట్ నిర్వహించేందుకు అనుమతులు రాకపోవడంతో ఆ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)