ఇటీవల ఆమెపై సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ట్రోలింగ్‌పై ఆమె స్పందిస్తూ.. నాపై ఇష్టానుసారం అసభ్యంగా పోస్టులు పెట్టడం సరికాదని తెలియజేశారు. తాజాగా ఆమె విక్కీ కౌశల్, తాప్సీతో కలిసి ఓ బాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సమంత తన పర్సనల్ విషయాలపై భావోద్వేగంగా మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. ''ఎంతో కష్టపడి నా కెరీర్‌ను నిర్మించుకున్నా. ఈ ఏడాది (2021) నా వ్యక్తిగత జీవితానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నా ఆశలన్నీ శిథిలమైయ్యాయి. ఎంతో మనోవేదనకు గురయ్యా. సోషల్ మీడియా పరంగా కొందరు నాకు సపోర్ట్ చేస్, మరికొందరు అసభ్యకర కామెంట్స్‌తో నన్ను ట్రోల్ చేస్తున్నారు. నన్ను ట్రోల్ చేసేవారికి, నేనంటే నచ్చని వారికి చెప్పేది ఒక్కటే.. నా అభిప్రాయాలు మీకు నచ్చాలని రూలేం లేదు. కాకపోతే దానిని వ్యక్తపరిచే విధానం అయితే ఇది కాదు. నాపై ఇష్టానుసారం అసభ్యకరంగా పోస్టులు పెట్టడం సరికాదు. 2021లో నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. కాబట్టి రాబోయే నూతన సంవత్సరంపై ఎటువంటి ఆశలూ పెట్టుకోలేదు. భవిష్యత్ కాలం ఎలా ఉన్నా ధైర్యంగా స్వీకరించడానికి సిద్ధమయ్యాను..'' అని సమంత పేర్కొంది.
సమంత భావోద్వేగ వ్యాఖ్యలు
December 10, 2021
0