మెక్సికోలో 49 మంది వలస కూలీల దుర్మరణం

Telugu Lo Computer
0


మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 49 మంది వలస కూలీలు దుర్మరణం చెందారు. మెక్సికోలోని దక్షిణాది రాష్ట్రమైన చియాపాస్‌లో వలసదారులతో వెళ్తున్న ట్రక్కు గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 49 మంది వలసదారులు మృతి చెందారని అధికారులు తెలిపారు. మరో 40 మంది గాయపడ్డారని.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. గ్వాటెమాలా సరిహద్దు రాష్ట్రమైన చియాపాస్‌లో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. అతివేగంగా ఉన్న వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. మరణించిన వారంతా వలస కార్మికులని అధికారులు నిర్ధారించారు. సరైన ధృవపత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్తున్నారని స్థానిక ప్రాసిక్యూటర్ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమన్నారు. కూలీలు ప్రయాణిస్తున్న ట్రక్కు దురద్రుష్టవశాత్తు అదుపుతప్పి చియాపాస్‌లో రిటైనింగ్ గోడను బలంగా ఢీకొని బోల్తా పడిందని వెల్లడించారు. వారంతా ఏదేశానికి చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)