ఇండిగో ఎయిర్‌లైన్‌ బంపర్‌ ఆఫర్‌ !

Telugu Lo Computer
0


షిల్లాంగ్‌ టూర్‌ వెళ్లాలనుకునేవారికి రూ.1,400కే ఇండిగో ఎయిర్‌లైన్‌ విమాన టికెట్‌ను ఆఫర్‌ చేస్తోంది. నవంబర్‌ 2 నుంచి దిబ్రూగఢ్‌ నుంచి షిల్లాంగ్‌ మధ్యలో డైరెక్ట్‌ విమానాలను ప్రారంభించింది ఇండిగో. ఆఫర్లలలో భాగంగా ఈ విమాన ప్రయాణం ధర రూ.1,400గా నిర్ణయించింది. ఈ మేరకు ఇండిగో తన ట్విటర్‌ హ్యాండిల్‌లో ఈ ఆఫర్‌ను ప్రకటించింది. తమ నాన్ స్టాప్ ఫ్లయిట్స్‌తో దేశంలో దాగివున్న ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను తాము కనుగొంటున్నామని ఇండిగో ఎయిర్ లైన్స్ ట్వీట్ చేసింది. దిబ్రూగడ్‌ నుంచి షిల్లాంగ్‌ మధ్య ప్రయాణం చేసేందుకు నేరుగా ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో చాలా మంది రోడ్డు, రైలు మార్గంలో దాదాపు 12 గంటలు ప్రయాణించాల్సి వస్తుంది. కానీ ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ ద్వారా ఈ 12 గంటల ప్రయాణాన్ని కేవలం 75 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ట్విటర్‌ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం.. షిల్లాంగ్ టూ డిబ్రూగఢ్… రూ.1400, డిబ్రూగఢ్ నుంచి షిల్లాంగ్… రూ.1400, ఇక కోయంబత్తూర్ నుంచి తిరుపతి… రూ.2499, తిరుపతి నుంచి కోయంబత్తూర్.. రూ.2499, అలాగే రాయ్‌పూర్ నుంచి భువనేశ్వర్.. రూ.2499 భువనేశ్వర్ నుంచి రాయ్‌పూర్… రూ.2499 ధర నిర్ణయించినట్లు తెలిపింది. ఈ విమాన ప్రయాణం చేసేవారు ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)