ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనుమరాలు నిహారిక (వెంకయ్య కుమారుడు హర్ష, రాధమ్మ దంపతుల కూతురు) పెండ్లి హైదరాబాద్లోని జీఎంఆర్ ఎరీనాలో గురువారం ఘనంగా జరిగింది. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పీసీసీ చీఫ్రేవంత్ రెడ్డి, సినీనటులు చిరంజీవి, నాగార్జున, పలువురు మంత్రులు, నాయకులు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.