చలికాలం - పల్లి పట్టీలు - ప్రయోజనాలు

Telugu Lo Computer
0


బెల్లం, వేరుశెనగ చిక్కీ. శీతాకాలంలో ఇది తింటే  ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం-వేరుశెనగ చిక్కి తినడానికి రుచిగా ఉండటమే కాకుండా శరీరాన్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.  బెల్లం-వేరు శెనగ చిక్కీ తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం, 250 గ్రాముల పొట్టు తీసిన వేరుశెనగ, 200 గ్రాముల బెల్లం, అర కప్పు నీరు, తగినంత వెన్న అవసరం. పల్లి పట్టీ (బెల్లం-వేరు శెనగ చిక్కీ) తయారు చేయడానికి ముందుగా పాన్ వేడి చేయాలి. ఆ తరువాత పల్లీలను బాగా వేయించాలి. తద్వారా అవి క్రిస్పీగా మారుతాయి. ఇప్పుడు ఒక గిన్నెలో అరకప్పు నీళ్లు పోసి బెల్లం వేసి గ్యాస్‌పై ఉడికించాలి. బెల్లం పాకంలో వేరుశెనగ వేసి బాగా కలపాలి. ఆ తరువాత నెయ్యి, వెన్నతో మిక్స్ చేసి.. కావాల్సిన ఆకృతిలో మార్చుకోవాలి. కావాలనుకుంటే.. డ్రై ఫ్రూట్స్‌ని కూడా చేరచ్చవచ్చు.  ఈ చిక్కీలను భద్రపరుచుకుని, కావాల్సినప్పుడు తినొచ్చు. దీన్ని రోజూ తినడం వల్ల శరీరంలో రక్త హీనత తగ్గుతుంది. అలాగే శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉండటానికి దోహదపడుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)