లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ మిస్సైల్ టోర్పెడో (స్మార్ట్)ను విజయవంతంగా పరీక్షించింది భారత్. ఒడిశా బాలాసోర్ తీరంలో ఈ క్షిపణిని ప్రయోగించారు. ఈ ఆయుధ వ్యవస్థను డీఆర్‌డీఓ (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) అభివృద్ధి చేసింది. యాంటీ- సబ్ మెరైన్ వార్‌ఫేర్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని డీఆర్‌డీఓ పేర్కొంది. భారత నౌకాదళానికి ఇది అందించనుంది డీఆర్‌డీఓ. దక్షిణ చైనా సముద్రంలో పట్టు కోసం పావులు కదుపుతోన్న డ్రాగన్‌కు కళ్లెం వేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అయితే సూపర్ సోనిక్ మిసైల్ టెస్ట్ విజయవంతం కావడం భారత్‌కు కలిసొచ్చే అంశమని రక్షణ శాఖ అధికారులు ఉవాచ.
సూపర్ సోనిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం
December 13, 2021
0