బస్సుల్లో చిల్లర డబ్బు కోసం కండక్టర్‌ను ప్రయాణికులు అడగడం, కొన్నిసార్లు గొడవ జరగడం అందరికీ తెలిసిందే. ప్రయాణికులు చిల్లర కోసం కండక్టర్లపై ఒత్తిడి తెస్తుండడాన్ని అరికట్టడానికి వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ వివాదాస్పద పోస్టర్‌లను బస్టాండ్‌లలో అతికించింది. ప్రయాణికులు కండక్టర్లపై ఒత్తిడి తెస్తుండడాన్ని అరికట్టడానికి వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ వివాదాస్పద పోస్టర్‌లను బస్టాండ్‌లలో అతికించింది.బస్సుల్లో చిల్లర అడగడం ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడమే అవుతుంది. నేరం రుజువైతే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది అని పోస్టర్లో హెచ్చరిక ఉంది. చిల్లర అడిగితే జైలుకు పంపుతారా, ఇదెక్కడి చోద్యం అని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
చిల్లర అడిగితే జైలుశిక్ష...?
December 09, 2021
0
Tags