బీహార్‌లోని నవాడా ప్రాంతానికి చెందిన దేవేంద్ర సింగ్ తన కూతురు కాజల్ కుమారిని ధీరజ్ సింగ్ అనే వ్యక్తికి ఇచ్చి 2018లో వివాహం చేశాడు. పుట్టింటిని వదిలి అత్తారింటికి అడుగుపెట్టిన కాజల్ కుమారి ప్రతి రోజూ తన అన్న గుల్షన్ కుమార్‌కు వీడియో కాల్ చేసేది. ఇలా మూడేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో శుక్రవారం రోజు కాజల్ కుమారి నుంచి గుల్షన్ సింగ్‌కు ఫోన్ రాలేదు. దీంతో అతడు కంగారు పడ్డాడు. అంతేకాకుండా కాజల్ కుమారి అత్తారింటికి వెళ్లాడు. అనంతరం అక్కడ చూసిన దృశ్యాలను చూసి షాకయ్యాడు. ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో కంగుతిన్నాడు. ఆ తర్వాత తన చెల్లి ఆసుపత్రిలో ఉందని తెలుసుకుని అక్కడకు వెళ్లాడు. తీరా ఆసుపత్రికి వెళ్లిన తర్వాత అతడికి చేదు వార్త తెలిసింది. కాజల్ కుమారి చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో అతడు కన్నీరుమున్నీర య్యాడు. ఈ క్రమంలోనే ధీరజ్ సింగ్ అతడి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదనపు కట్నం కోసం తన చెల్లిలిని భర్త, అతడి తల్లిదండ్రులు వేధించారని పేర్కొన్నాడు. అన్నంలో వాళ్లే విషం కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న ధీరజ్ సింగ్, అతడి తల్లిదండ్రుల కోసం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
అదనపు కట్నం కోసం హత్య !
December 11, 2021
0
Tags