ఎర్ర అరటిపండు - ప్రయోజనాలు

Telugu Lo Computer
0


ప్రపంచవ్యాప్తంగా 18 రకాల అరటిపండ్లు ఉన్నాయి. భారతదేశంలో పసుపు, ఆకుపచ్చ మాత్రమే తింటారు. ఈ రెండు కాకుండా రోగనిరోధక శక్తిని పెంచే ఎర్రటి అరటి కూడా ఉంది. ఇవి కేరళలో విరివిగా దొరుకుతాయి. దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు. ఎర్రటి అరటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు సరైన మొత్తంలో లభిస్తాయి. దీని సహాయంతో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. ఈ అరటిపండు ఆస్ట్రేలియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ దొరుకుతుంది. ఈ అరటిపండును రెడ్ డాకా అని కూడా అంటారు. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, విటమిన్ బి6 ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఉదయపు అల్పాహారంలో ఎర్రటి అరటి పండును చేర్చినట్లయితే అది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శక్తివంతంగా ఉండటం వల్ల మీరు ఫ్రెష్‌గా ఉంటారు. ఊబకాయం కారణంగా రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. ఎర్రటి అరటి పండు తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీనిని తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి అనిపించదు దీనివల్ల అతిగా తినకుండా ఉంటారు. కళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో ఎర్రటి అరటిపండు చాలా సహాయకారిగా పనిచేస్తుంది. వాస్తవానికి కంటి సమస్యలను తొలగించడంలో లుటిన్, బీటా కెరోటిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ రెండూ ఎర్రటి అరటిపండులో ఉంటాయి. ఎర్రటి అరటి షేక్ చేయడానికి పాలు, యాలకులు, జాజికాయ ఉపయోగించి వారానికి మూడుసార్లు ఈ షేక్ తాగితే ఆరోగ్యానికి మంచిది. 

Post a Comment

0Comments

Post a Comment (0)