మిచెల్‌ స్టార్క్‌కు తొలి టెస్టులో తొలి బంతికే వికెట్‌

Telugu Lo Computer
0


యాషెస్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. లంచ్‌ విరామ సమయానికే ఇంగ్లండ్‌ టాపార్డర్‌ను ఆసీస్‌ బౌలర్లు కకావికలం చేశారు. ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అరుదైన రికార్డును నమోదు చేశాడు. తొలి టెస్టులో స్టార్క్‌ తన తొలి బంతికే ఇంగ్లండ్‌ ఓపెనర్‌ రోరీ బర్న్ స్‌ను గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేర్చాడు. స్టార్క్‌ వేసిన తొలి బంతిని హిట్‌ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో​ బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అయి ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. ఇలా యాషెస్‌ చరిత్రలో ఒక ఆస్ట్రేలియన్‌ పేసర్‌ తొలి టెస్టు తొలి బంతికే వికెట్‌ తీయడం 85 ఏళ్ల తర్వాత ఇది రెండోసారి. ఇంతకముందు 1936లో ఆస్ట్రేలియా పేసర్‌ ఎర్నీ మెక్‌కార్మిక్.. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ స్టాన్‌ వర్తింగ్‌టన్‌ను తొలి బంతికే డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ రెండో సెషన్‌లో 6 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఓలీ పోప్‌ 36, క్రిస్‌ వోక్స్‌ 2 పరుగులతో ఆడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)